Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి సంస్థలో 155 క్లర్క్ పోస్టుల (జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను ఇప్పటికే సంస్థలో పనిచేస్తున్న బదిలీ వర్కర్ మొదలు ఇతర పోస్టుల్లో పనిచేస్తున్న ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులతో భర్తీ చేయాలని నిర్ణయించినట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్.శ్రీధర్ నిర్ణయించారని డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) ఎన్.బలరామ్ తెలిపారు. అర్హులైన అంతర్గత అభ్యర్థులు ఈ నెల 25 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.తుది గడువు జూన్ 10గా నిర్ణయించారు.