Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ స్థాయిలో ఐదు నైపుణ్యాభివృద్ధి అవార్డులు లభించాయి. ఈనెల 28న భువనేశ్వర్‌లోని రైల్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వీటిని అందచేస్తారని దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సెక్యూరిటీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణ (పశ్చిమ మధ్య రైల్వేతో కలిసి సంయుక్తంగా), సివిల్ ఇంజినీరింగ్ (పశ్చిమ మరియు మధ్య రైల్వేలతో కలిసి), స్టోర్స్ (పశ్చిమ రైల్వేతో కలిసి), సివిల్ ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ (నార్త్ వెస్ట్రన్ రైల్వేతో కలిసి) విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి అవార్డులు లభించినట్టు వివరించారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ అధికారులను అభినందించారు.