Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మద్యం ప్రియులకు తాగకుండానే ఫుల్ కిక్ ఎక్కింది. తెలంగాణ ప్రభుత్వం మరో మారు మద్యం ధరలను భారీగా పెంచింది. ఆర్డినరీ, మీడియం మద్యం 180 ఎంఎల్ లిక్కర్ (క్వార్టర్) బాటిల్‌పై రూ.20, ప్రీమియం మద్యం క్వార్టర్ బాటిల్‌పై రూ.40ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఆర్డినరీ, మీడియం మద్యం 375 ఎంఎల్ (హాఫ్) బాటిల్‌పై రూ. 40, 750 ఎంఎల్ (ఫుల్) బాటిల్‌పై రూ.80 చొప్పున పెరిగింది. ప్రీమియం మద్యం హాఫ్ బాటిల్‌పై రూ.80, ఫుల్ బాటిల్‌పై రూ.160 చొప్పున పెంచారు.
లిక్కర్‌తో పాటు వైన్, బీర్ల ధరలు కూడా పెరిగాయి. వైన్ క్వార్టర్ బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున పెంచారు. ఇక ప్రతి బీరుపై రూ.10 చొప్పున రేటు పెరిగింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేయడంతో పెరిగిన రేట్లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దాంతో ప్రభుత్వ ఖజానాకు భారీ డబ్బులు సమకూరనున్నాయి.