Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గతేడాదితో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఎనిమిది శాతం పెరిగాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన ఆరోగ్యశ్రీ పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2019-20లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరోగ్యశ్రీ సేవలు 35 శాతంగా ఉంటే, 2021-22లో అది 43 శాతానికి పెరిగాయని తెలిపారు. ఈ శాతం పెరిగేందుకు కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. వైద్యాధికారులు ఆస్పత్రులను ఆకస్మికంగా సందర్శించాలనీ, సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ సీఈవో రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.