Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్వోబీ), హైదరాబాద్ కార్యాలయం ఎంపానెల్మెంట్ నిమిత్తం కళాకారుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించింది. రాష్ట్రంలోని సాంస్కృతిక బందాలు, నాటిక, నత్య నాటిక, వీధి నాటకాలు, ఫ్లాష్ మాబ్, కాంపొసిట్ బందాలు,జానపద,సాంప్రదాయ, పౌరాణిక కళలు, మ్యాజిక్, తోలుబొమ్మలాటలు,యక్షగానం, చిందు యక్షగానం, కోయ,గోండు, లంబాడ తదితర కళారూపాలు ప్రదర్శించగల కళాకారులు, గాయకులు, సంగీత కళాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు.పూర్తి చేసిన దరఖాస్తులు 2022 జూన్,14వ తేదీ లోపు హైదరాబాద్ రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో కార్యాలయానికి పంపించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివద్ధి కార్యక్రమాలు,ఆరోగ్యం,సంక్షేమం వంటి వివిధ అంశాలపై స్థానిక కళాకారులచే కళారూపాల ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని హైదరాబాద్ రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో సంచాలకులు శ్రీమతి శతి పాటిల్ పత్రికా ప్రకటనలో తెలిపారు.పూర్తి సమాచారం కోసం ఔఔఔ.సaఙజూ.WWW.davp.nic.inవెబ్సైట్లో చూడొచ్చని పేర్కొన్నారు.