Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లోని గాంధీ ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజు ఆరు మోకాలిచిప్ప మార్పిడి (నీ రీప్లేస్ మెంట్ ) శస్త్రచికిత్సలు చేశారు. ముదిరిన ఆర్థరైటీస్ సమస్యతో బాధపడుతున్న రోగులకు గురువారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారు ప్రయివేటులో చేయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారు. అయితే రెండు నెలలుగాపెద్ద సంఖ్య లో ఇలాంటి శస్త్రచికిత్సలను ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాల కింద వీటిని ఉచితంగా చేస్తుండటంతో పేద రోగులు ఊపిరిపీల్చు కుంటున్నారు. తాజాగా ఆరు మోకాలిచిప్ప మార్పిడి శస్త్ర చికిత్సలు చేసిన బందానికి డాక్టర్ వాల్య నేతృత్వం వహించగా, అనస్తేషియా బృందానికి డాక్టర్ బేబిరాణి, నర్సింగ్ బందానికి సునీత నేతృత్వం వహించారు. నిర్దేశించుకున్న సమయంలోపు శస్త్రచికిత్సలు పూర్తయ్యేం దుకు సంబంధిత బోధనా సిబ్బంది, రెసిడెంట్ డాక్టర్లు, ఇంటర్నీలు సహకరించారు. రోగులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, వారంతా అప్పుడే హాయిగా నడక ప్రారంభించడం గమనార్హం.