Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే గచ్చిబౌలిలో సుధాభాస్కర్, ప్రభాకర్
నవతెలంగాణ-గచ్చిబౌలి
సుందరయ్య విజ్ఞానకేంద్రం గచ్చిబౌలిలో సుందరయ్య 37వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నవతెలంగాణ పత్రిక ఎడిటర్ సుధాభాస్కర్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, గచ్చిబౌలి కార్యదర్శి పి. ప్రభాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుందరయ్య తన యావదాస్తిని ప్రజల కోసం పంచిన ఆదర్శమూర్తి అని, ప్రజా పాలనను ప్రజలకు అన్నివిధాల అందే విధంగా ప్రజల కోసం పరితపించిన మహానేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్వీకే నిర్వాహకులు విజరు కుమార్, రవీందర్, అనిల్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సిబ్బందికి యూనిఫామ్ అందజేశారు.