Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్
నవతెలంగాణ-సత్తుపల్లి రూరల్
పోడు సాగుదారులకు హక్కు పట్టాల కోసం బలమైన పోరాటాలు నిర్వహించడమే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు అర్పించే నిజమైన నివాళులు అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశం వద్ద ఉపాధి కూలీలకు వ్యకాస మండల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సభ నిర్వహించారు. కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటికీ వ్యవసాయ పనుల్లో వెట్టి చాకిరీ అమలవుతోందన్నారు. భూస్వాములు, పెత్తందారుల నుంచి మిగులు భూములను భూ సీలింగ్ చట్టం అమలు ద్వారా బయటకు తీసి పేదలకు పంచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అభివృద్ధి పేరుతో పేదల భూములను బలవంతంగా లాక్కొంటున్నారన్నారు. పట్టా భూములతో సమానంగా పేదల అనుభవ భూములకు, అసైన్డ్‌మెంట్ భూములకు పరిహారం ఇవ్వాలని చట్టం వున్నా అములు చేయడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయుకులు బాల బుచ్చయ్య, కువ్వారపు లక్ష్మణరావు, మహేష్, శేషు, వెంకటరమణ, ప్రభాకర్, కుమారస్వామి, కొలికపోగు సర్వేశ్వరావు, చిట్టిమ్మ, హనుమంతు రావు పాల్గొన్నారు.