Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -గంభీరావుపేట
చెరువులో ఈతకు వెళ్లి నీటమునిగి ఇద్దరు ఇంటర్మీడియెట్ విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం జరిగింది. సీఐ కొలాని మొగిలి తెలిపిన వివరాల ప్రకారం..
గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చిన్నకర్రోళ్ల రవితేజ (17) ఇంటర్ మొదటి, మహమ్మద్ సమీర్ (18) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నారు. మండల కేంద్రంలోని నమాజ్ చెరువులోకి గురువారం ఈతకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ మునిగిపోయాచు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా రవితేజ, సమీర్ మృతదేహాలు లభ్యమయ్యాయి. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్దిపేట సీఐ మొగిలి, స్థానిక ఎస్ఐ బొజ్జ మహేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.