Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమాజ మార్పు కోసం కోసం జరిగిన ఉద్యమాల్లో శ్రామిక మహిళల పాత్ర కీలకమైందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ.రమ తెలిపారు. కలకత్తాలో శుక్ర, శనివారాల్లో జరగబోయే అఖిల భారత శ్రామిక మహిళల కో-ఆర్డినేషన్ కమిటీ 12వ కన్వెన్షన్లో పాల్గొనేందుకు వీలుగా రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాతంత్ర ఉద్యమాల్లో శ్రామిక మహిళలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సమాజంలో భాగంగా ఉన్న మహిళల విముక్తి జరగకుండా దోపిడీని అరికట్టలేమని తెలిపారు. ప్రస్తుత పెట్టుబడిదారీ, భూస్వామ్య సమాజంలో మహిళల ప్రాధమిక సమస్యలు ఎప్పటికీ పరిష్కారానికి నోచుకోవని స్పష్టం చేశారు. .ఈ అవగాహనతో సీఐటీయూ పని చేస్తున్నదని వివరించారు. దేశంలో మితవాద రాజకీయాల వికత చేష్టలకు ముందుగా బలయ్యేది శ్రామిక మహిళలే అని ఆందోళన వ్యక్తం చేశారు. వాటికి విరుగుడు ప్రజా పోరాటాలేనని తెలిపారు.