Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అసెంబ్లీ ఆవరణలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. 2024 ఏప్రిల్ వరకు రెండేండ్ల పదవీకాలంతో కూడిన ఉప ఎన్నిక అభ్యర్థిగా ఆయన ఈ నామినేషన్ వేశారు. గాయత్రి రవి వెంట మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజరు కుమార్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, జనగామ, వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపనేని నరేందర్, దాస్యం వినరు భాస్కర్ ఉన్నారు. నామినేషన్ అనంతరం మంత్రులు, అభిమానులు రవిచంద్రను అభినందించారు. అనంతరం జరిగిన కృతజ్ఞతా సభలో మున్నూరు కాపులు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.