Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు భూపాల్
- రిలే దీక్షలు ప్రారంభం
నవ తెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కంసాన్పల్లి రైతులకు ప్రభుత్వం వెంటనే పాసు పుస్తకాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు భూపాల్ డిమాండ్ చేశారు. నారాయణ పేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కంసాన్పల్లి రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షను గురువారం భూపాల్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములను ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల పేరుతో తీసుకోవాలను కోవడం సరైంది కాదన్నారు. కొండలు గుట్టలను తొలగించి చదును చేసి బోర్లు వేసుకుని పంటలు పండించుకుటున్నారని చెప్పారు. ఆ భూములను ప్రభుత్వం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పరిశ్రమలకు అవసర మైతే ప్రభుత్వం భూములు కొనుగోలు చేసి ఇవ్వాల న్నారు. రైతుల భూములు తీసుకోవాలనుకుంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జోక్యం చేసుకుని వెంటనే రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరారు. రైతులను కాదని ప్రభుత్వం ఒక్క సెంటు భూమి కూడా తీసుకోలేదని హెచ్చరించారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఇస్తామని సర్వే చేసి పది నెలలు గడుస్తు న్నా సర్వే రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. వెంటనే గ్రామసభకు సర్వే రిపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలం గాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య, నాయకులు శివ కుమార్, జోషి హనుమంతు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మోహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.