Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరికొండ మండలం పందిమడుగులో ఘటన
నవతెలంగాణ-సిరికొండ
తన ధాన్యాన్ని తూకం వేయడం లేదని ఓ రైతు ధాన్యం కుప్పకు నిప్పంటించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పందిమడుగు గ్రామంలో జరిగింది. మాలవత్ మహేందర్ వరి పైరును కోసి 20 రోజులు గడిచింది. ఇప్పటి వరకు ధాన్యాన్ని తూకం వేయలేదు. దాంతో గురువారం ధాన్యం కుప్పకు నిప్పంటించి నిరసన తెలిపాడు. సీరియల్ ప్రకారం తాను ఉన్నప్పటికీ స్థానిక డైరెక్టర్, కొనుగోలు కేంద్రం ఇన్చార్జీని పదేపదే అడిగినా తూకం వేయడం లేదని, అందుకే విరక్తి చెందిన నిప్పంటించినట్టు రైతు తెలిపాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.