Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటియూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్
- రాష్ట్రవ్యాప్తంగా సహపంక్తి భోజనాలు
నవతెలంగాణ- విలేకరులు
సుందరయ్య వర్ధంతి సందర్భంగా సీఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దళితవాడల్లో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసి సహపంక్తి భోజన కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం, మల్లేపల్లి గ్రామ దళిత వాడ, మెదక్ జిల్లా, మనోహరాబాద్ మండలంలో నిర్వహించిన సహపంక్తి భోజనానికి సీఐటియూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, మేడ్చల్ జిల్లా నాచారం చాంద్పాషాదర్గాలో సహపంక్తి భోజన కార్యక్రమానికి సీఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుందరయ్య స్ఫూర్తితో ప్రజలను, కార్మికులందరినీ సంఘటితపర్చి దోపిడీ, పీడన, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. దళితవాడల్లో తిరుగుతూ కులవివక్షను రూపుమాపేందుకు పోరాటం చేశారని అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలో జరిగిన సహపంక్తి భోజనానికి సిఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం. సాయిబాబు హాజరయ్యారు. కార్మికవర్గం తమ హక్కులను కాపాడుకుంటూనే సమాజంలో జరుగుతున్న అన్నిరకాల అన్యాయాలను ఎదిరించాలని, ఇతర వర్గాలు చేసే పోరాటాలకు బాసటగా నిలవాలని సాయిబాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సౌత్ జిల్లా బేగం బజార్, కిసాన్ గంజ్, ముక్తార్ గంజ్ కేంద్రాలలో సురదరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. సామాజిక సంఘీభావ నిధిని సేకరించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్ హాజరయ్యారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో సీఐటియూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, నారాయణపేట జిల్లాలో సీఐటియూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, పటాన్చెర్వులో సీఐటియూ రాష్ట్ర కార్యదర్శి జొన్నలగడ్డ మల్లిఖార్జున్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలో రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, హైదరాబాద్ సౌత్ జిల్లాలో రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సుధాకర్ పాల్గొన్నారు.