Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు చెప్పారు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో గురువారం సుందరయ్య 37వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి వెన్నుదన్నుగా సుందరయ్య నిలిచారని చెప్పారు. బడుగు, బలహీన తరగతుల ప్రజానీకం సమస్యలపై పనిచేశారని తెలిపారు. సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లిన గొప్ప ఆదర్శవంతుడు సుందరయ్య అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. సుందరయ్య మార్గం ఆచరణీయమన్నారు. భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారని తెలిపారు. తన భూమినంతా పేదలకు పంపిణీ చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. సుందరయ్య తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని చెప్పారు. దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలు బలపడితేనే ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుందన్నారు.
మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలపై భారాలు మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాద రాజకీయాలను ముందుకు తెచ్చి దేశంలో అశాంతి పెంచేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మతోన్మాదశక్తులను ఎదుర్కోవడానికి సీపీఐ(ఎం) శ్రేణులు ముందుకు రావాలన్నారు. సుందరయ్య ఆశయ సాధన కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, బూర్గు కష్ణారెడ్డి, నాయకులు బండారు నర్సింహా, గంగదేవి, సైదులు, మున్సిపల్ వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం, చిన్నకొండూరు ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ పాల్గొన్నారు. దుమ్ముగూడెం మండలంలో సుందరయ్య చిత్ర పటానికి సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు మిడియం బాబూరావు నివాళి అర్పించారు.