Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫ్యామిలీ ఫిజిషియన్ల డే సందర్భంగా గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డాక్టర్లు ఉచిత సేవలందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని క్రిస్టియన్ ఫెల్లోషిప్ హెల్త్ సెంటర్లో జరిగిన ఉచిత ఆరోగ్య శిబిరంలో అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌తో పాటు చిన్న పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ నళిని పాల్గొని పలువురిని పరీక్షించారు. సైనిక్ పురిలో డాక్టర్ సరిత నిమ్మ ఉచిత డైమెన్షియా స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. చింతల్లో చిరాన్ స్పెషలిస్ట్ క్లినిక్ ఉచిత డయాబెటిక్ క్యాంప్ నిర్వహించి డాక్టర్ కన్సల్టేష న్‌తో పాటు ఉచితంగా షుగర్ టెస్టులను అందించింది. డాక్టర్ సత్తూర్ కవితారాణి వార్షిక ఆరోగ్య పరీక్షల ప్రాధాన్యతపై శిబిరాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. కేపీహెచ్‌బీ సమీపంలోని ఒమేగా క్లినిక్స్‌లో డాక్టర్ కె.శిరీష ఒకరికి చెల్లించే డాక్టర్ కన్సల్టేషన్ ఫీజుతో కుటుంబంలో మరొకరికి ఉచిత వైద్య పరీక్షల సౌకర్యాన్ని కల్పించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి శిబిరాలనే ఫ్యామిలీ డాక్టర్లు నిర్వహించి సేవలందించారని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.