Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లపై సమీక్షించిన సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 26న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 26న ఐఎస్‌బిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని తెలిపారు. ఎన్ఎస్జి సమన్వయంతో వివిధ శాఖలు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ అనుసరించి పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, హౌం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రాజ్‌భవన్, గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, అగ్నిమాపక శాఖ డీజీ సంజరు కుమార్ జైన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమరుకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.