Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన నిఖత్ జరీన్‌కు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. థారులాండ్ బాక్సర్‌పై తెలంగాణలోని నిజామాబాద్‌కు చెదిన యువ బాక్సర్ జరీన్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలిచిన ఐదో భారత బాక్సర్‌గా ఆమె రికార్డు సాధించారని తెలిపారు. ఇలాంటి విజయాలు భవిష్యత్‌లో మరిన్ని సాధించాలని కోరారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న క్రీడాకారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి సరైన శిక్షణనివ్వాలని సూచించారు. వారికి అన్ని విధాలుగా తోడ్పాటునందించాలని కోరారు. దీంతో రాష్ట్రానికి ఇలాంటి పతకాలు మరిన్ని తెచ్చేందుకు దోహదపడాలని పేర్కొన్నారు.