Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు దాసోజు ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పంజాబ్ రైతులను ఆదుకోడానికి సీఎం కేసీఆర్ పంజాబ్ వెళ్తే...మరి తెలంగాణ రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా ? అని ఏఐసీసీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కేంద్ర రాజకీయల్లో స్థానం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎనిమిదివేల వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే,194 జీవో ప్రకారం కేవలం వెయ్యి మందికి మాత్రమే పరిహారం చెల్లించి, మిగతా ఏడువేల మంది కుటుంబాలను విస్మరించారని విమర్శించారు. వడ్ల కొనుగో లు ప్రారంభమై 45 రోజులైతేే, ఇంకా 40 శాతం కూడా కొనలేదని చెప్పారు. రైతురుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. 2020 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటికే నష్టపరిహారం చెల్లించలేదన్నారు. నెలరోజులుపాటు విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా తమ పార్టీ డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.