Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యూజియం వారోత్సవాల ముగింపు సభలో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
నవతెలంగాణ-ధూల్‌పేట్
హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియం ఎంతో చారి త్రాత్మకమైందని, నేటికీ అందరినీ ఆకట్టుకుంటోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాలార్జంగ్ మ్యూజియం వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యూజియంలోని నిజాం కాలం నాటి కళా ఖండాలు, రూపాలు నేటికీ జీవకళ ఉట్టిపడేలా ఉన్నాయని, చూపరులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఇందులోని రాజు, రాణి విగ్రహాలు, వస్త్రాభరణాలు, అలాగే చిన్నారులు వేసిన పెయింటింగ్‌లు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. అంతకుముందు మ్యూజియంలోని ప్రదర్శనలు, పెయింటింగ్ ఆర్ట్ గ్యాలరీలను గవర్నర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం కీపర్ డాక్టర్ జి.కుసుం, ఆర్బి. నాయక్, చింతల శ్రీనివాస్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.