Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్నానాలు చేస్తుండగా ప్రమాదం
నవతెలంగాణ-బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతెపట్టీ నగర్ పుష్కర ఘాట్ వద్ద గోదావరిలో ముగ్గురు వ్యక్తులు శుక్రవారం గల్లంతయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండల కేంద్రానికి చెందిన రిహనా తన ఇద్దరు కుమారులు, జూలురుపాడు మండలం కాకర్లకు చెందిన రాయపూడి నర్సింహారావు అనే వ్యక్తితో కలిసి ఆటోలో మోతె గోదావరి పుష్కరఘాట్ వద్దకు వచ్చి స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు తల్లి రిహనా, చిన్న కుమారుడు ఇర్ఫాన్, ఆటో డ్రైవర్ నర్సింహారావు నీటిలో గల్లంతు కాగా పెద్ద కుమారుడు ఇమ్రాన్ క్షేమంగా ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు గాలించిన ఆచూకీ తెలియరాలేదు. జరిగిన సంఘటనపై బూర్గంపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.