Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురువయ్య ,కోటమ్మ విగ్రహావిష్కరణలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
కమ్యూనిస్టుల జీవనం ఎంతో ఉత్తమమైనదని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జప్తివీరప్ప గూడెం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పేలాప్రోల గురువయ్య, కోటమ్మల విగ్రహావిష్కరణ, వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. పేద ప్రజానీకం కోసం తపించి వారి కోసమే జీవించారని గరవయ్య దంపతులను కొనియాడారు. ప్రతి ఒక్కరికీ వారు జీవించిన విధానమే మరణించిన తర్వాత కూడా జీవింప చేస్తుందని తెలిపారు. రంగురంగుల రాజకీయ పార్టీలు ప్రజలను భ్రమింపజేసే పథకాలు ఎన్ని వచ్చినా కడవరకు కమ్యూనిస్టుగా జీవించిన పెద్ద గురువయ్య ఆశయ సాధన కోసం నేటి తరం పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు విరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, మల్లు గౌతమ్ రెడ్డి, సీనియర్ నాయకులు గాదె పద్మమ్మ, ఎంపీటీసీ వంకాయలపాటి చలపతిరావు, విగ్రహ దాత పేలపొలు సైదయ్య మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.