Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తా..
- జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్
నవతెలంగాణ-చౌటుప్పల్
తెలంగాణలో వెనుకబడిన అన్ని సామాజిక తరగతుల వారికి అండగా ఉంటానని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన జనసేనపార్టీ క్రియాశీలక సభ్యులు కొంగరి సైదులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారంలో సైదులు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో మంది త్యాగాలు చేశారన్నారు. సామాజిక మార్పు కోసమే జనసేన పార్టీ ఏర్పడిందన్నారు. రాబోయే ఎన్నికల్లో మూడో వంతు స్థానాల్లో పోటీ చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో తమపార్టీకి ఓటుబ్యాంకు ఉందన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. రాజకీయాల్లో కొత్తతరం రావాలన్నారు. తెలంగాణలో గెలుపోటములను జనసేన ప్రభావితం చేస్తుందన్నారు. పట్టణకేంద్రంలోని జాతీయ రహదారిపై ప్రజలకు ఆయన అభివాదం చేశారు. అనంతరం కోదాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హుజూర్‌నగర్‌కు చెందిన కడియం శ్రీనివాస్ కుటుంబానికి రూ.5లక్షల బీమా చెక్కు అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జీ మేకల సతీశ్‌రెడ్డి, నాయకులు గోకుల రవీందర్‌రెడ్డి, తొర్పునూరి లింగస్వామిగౌడ్, పర్నె శివారెడ్డి, ఆముదాల పరమేశ్‌గౌడ్, మామిడి శివ, నందగిరి నరేశ్, రేహాన్, భాస్కర్, ప్రవీణ్, మల్లేశ్ పాల్గొన్నారు.