Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రేమ వివాహమే కారణం!
- మృతుని డెడ్‌బాడీపై 20కిపైగా కత్తిపోట్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో దారుణ హత్య జరిగింది. సరూర్‌నగర్‌లో జరిగిన సంఘటన మరవక ముందే బేగంబజారులో మరో యువకుడు హత్యకు గురయ్యాడు. శుక్రవారం నగరం నడిబొడ్డున మచ్చి మార్కెట్ వద్ద నీరజ్ పన్వార్‌ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. యువకుడిని ఐదుగురు దుండగులు 20 సార్లు కత్తితో పొడిచినట్టు పోలీసులు గుర్తించారు. ఏడాది కిందట నీరజ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. దాంతో కక్షపెంచుకున్న యువతి కుటుంబసభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులను విచారించారు. ఈ హత్యలో మొత్తం ఐదుగురు నిందితుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రంగంలోకి టాస్క్ఫోర్సు సహా నాలుగు బృందాలను దించారు. రెండు ద్విచక్ర వాహనాలపై ఐదుగురు నిందితులు పాతబస్తీ వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న షాహీనాథ్గంజ్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నీరజ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.