Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- విలేకరులు
చలో సీసీఎల్ఏ ముట్టడికి హైదరాబాద్ బయలుదేరిన వీఆర్ఏలను శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అరైస్టైన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్రామి రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం తదితరులున్నారు. ఉట్కూరు మండల కేంద్రంలో కూడా వీఆర్ఏలను అరెస్టు చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలో ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అరైస్టైన వారిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, జిల్లా నాయకులు వెంకటేష్, రాము తదితరులున్నారు. నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో వీఆర్ఏలను ముందస్తుగా అరెస్టు చేసి సాయంత్రం వదిలిపెట్టారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నుంచి సీసీఎల్ఏకు తరలివెళ్తున్న వీఆర్ఏలను అరెస్తు చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ధర్నాకు బయలుదేరిన వీఆర్ఏలను ఖమ్మం జిల్లా బోనకల్, తల్లాడ, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో మధిర, బోనకల్, చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో నిరసన తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు, బొమ్మలరామారం, రామన్నపేట మండలాల్లో పోలీసులు అరెస్టు సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. నల్లగొండ జిల్లాలోని దామరచర్ల, నాంపల్లి మండలాల్లోనూ వీఆర్ఏలను పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో వీఆర్ఏలను పోలీసులు అరెస్టు చేశారు.