Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చూపిన మార్గంలో వెళ్ళడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా గాంధీభవన్లో ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాజీవ్ దేశాన్ని సాంకేతికంగా ప్రగతిపథంలోకి తీసుకెళ్లారనీ, 18 ఏండ్లకు ఓటు హక్కు కల్పించారనీ, గ్రామ పంచాయతీల స్థాయిలో పాలనా వికేంద్రీకరణ చేశారని గుర్తుచేశారు.
రాజీవ్ పేరు తొలగించడం కేసీఆర్ అహంకారం
అంతర్జాతీయ విమానాశ్రయానికి జీఎంఆర్ సంస్థ అధికారిక వెబ్సైట్లో రాజీవ్ గాంధీ పేరు తొలగించడం అన్యాయమని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
పార్థసారథికి రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారు? :ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హెటిరో ఫార్మాస్యూటికల్ యజమాని పార్థసారథికి టీఆర్ఎస్ ఏ ప్రాతిపదికన రాజ్యసభ సీటు ఇచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం తెచ్చుకున్నది ప్రజాపాలన చేయడానికా లేక వ్యాపారం చేయడానికా అని నిలదీశారు.