Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగదేవపూర్
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం రాయవరం గ్రామంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. డబ్బేట మల్లేశం(56) తన రెండెకరాల భూమితోపాటు ఎకరం పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు. గత సంవత్సరం పత్తి, మొక్కజొన్న, వరి పంటలు సాగు చేసి నష్టపోయాడు. పెట్టిన పెట్టుబడులు రాక అప్పులపాలయ్యాడు. దీనికితోడు పెద్ద కుమారుడు భాస్కర్ ఆరోగ్యం బాలేక గత సంవత్సరం ఆస్పత్రి ఖర్చులకు అధిక మొత్తంలో ఖర్చు చేశారు. అయినా కొడుకు దక్కలేదు. అటు కొడుకు మృతి.. ఇటు అప్పుల భారంతో మానసికంగా కుంగిపోయాడు మల్లేశం. శనివారం ఉదయం తమ పొలం వద్ద పురుగులమందు తాగి ఇంటికొచ్చాడు. చిన్న కొడుకు కర్ణాకర్ గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మల్లేశం మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు రూ.6 లక్షల వరకు అప్పులు ఉన్నట్టు కుటుంబీకులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.