Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీవో అధ్యక్షులు రాజేందర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించిన స్టాండింగ్ కమిటీ చైర్మెన్ అదర్సిన్హాకు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో అదర్సిన్హా నేతృత్వంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఇతర శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, మెడికల్ రీయింబర్స్మెంట్, సర్వీసు సంబంధిత విషయాలతోపాటు సవరణ ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుగా ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించా మని తెలిపారు. ఈనెలాఖరులోపు మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలనీ, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారు కోరుకున్న మెడికల్ రీయింబర్స్మెంట్, సర్వీసు నిబంధనలకు సంబంధించి అనేక సవరణలు మానవతా దృక్పధంతో చేయాలని సూచించారు.