Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డీఎస్పీ అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేండ్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పొడిగించింది. యూనిఫామ్ సర్వీసులకు రెండేండ్లు సడలింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఈ పెంపును వర్తింపచేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్పీ అభ్యర్థులకు ప్రస్తుతం 31 ఏండ్లు ఉన్న వయోపరిమితి అర్హతను 33 ఏండ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. డీఎస్పీ కేటగిరీ-2, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (పురుషులు), అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు ఇది వర్తిస్తుందని తెలిపారు. డీఎస్పీ అభ్యర్థుల ఎత్తును సైతం తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈక్రమంలో పురుషుల ఎత్తును 167.6 సెంటీమీటర్ల నుంచి 165 సెంటీమీటర్లకు తగ్గించామని వివరించారు. ఎస్టీ అభ్యర్థుల ఎత్తు 164 సెంటీమీటర్లను యథావిధిగా ఉంచామని తెలిపారు. మహిళా అభ్యర్థుల ఎత్తును ప్రస్తుతం 152.5 సెంటీమీటర్ల నుంచి 150 సెంటీమీటర్లకు తగ్గించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఆన్లైన్లో 1,74,938 దరఖాస్తులొచ్చాయని తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 31 వరకు అవకాశమున్నదని పేర్కొన్నారు. వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)కు సంబంధించి కొత్తగా 1,31,513 మంది, సవరణ చేసుకున్న వారు 2,74,329 మంది కలిపి 4,05,842 మంది అభ్యర్థులు పూర్తి చేసుకున్నారని వివరించారు. ఇతర వివరాలకు షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.