Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యావరణ హితం,
సమర్థనీటి వినియోగంకు అవార్డులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (ఎస్టీపీపీ) జాతీయ స్థాయి పురస్కారాలు లభించాయి. విద్యుదుత్పత్తి కోసం నీటిని అత్యంత పొదుపుగా వాడుతున్నందుకు గాను వాటర్ మేనేజ్ మెంట్ అవార్డు లభించింది. విద్యుదుత్పత్తికి ఉపయోగించిన అనంతరం ఆ నీటిని రీసైకిల్ చేస్తూ పునర్వినియోగిస్తున్నందున జీరో లిక్విడ్ డిశ్ఛార్జ్ ప్లాంట్‌గా అవార్డును అందుకుంది. శనివారం వర్చువల్‌లో జరిగిన సదస్సులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తంచేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)ను ఎస్టీపీపీ నమోదు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీపీపీ చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ ఎస్.కె.సుర్, చీఫ్ (ఓ అండ్ ఎం) జె.ఎన్.సింగ్, ఏజీఎం (ఈ అండ్ ఎం) చిన బస్విరెడ్డి, డీజీఎం (వాటర్ మేనేజ్మెంట్) జనగామ శ్రీనివాస్, ఎస్ఈ (ఐఈ) ఎం.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.