Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
- 70 శాతం సిలబస్‌తో నిర్వహణ
- 2,861 పరీక్షా కేంద్రాల్లో
- సీసీ కెమెరాల ఏర్పాటు
- 5,09,275 మంది హాజరు
- రెండేండ్ల తర్వాత పరీక్షలు
రాస్తున్న విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల ఒకటో తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. వాటిని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. అయితే 9.35 గంటల తర్వాత వారికి అనుమతి ఉండదు. 2,861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11,401 పాఠశాలల నునంచి 5,09,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలున్నారు. 5,08,110 మంది రెగ్యులర్, 1,165 మంది ప్రయివేటు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కరోనా నేపథ్యంలో రెండేండ్ల పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు 2020, 2021లో ఎనిమిది, తొమ్మిదో తరగతి పరీక్షలకూ హాజరు కాలేదు. రెండేండ్ల తర్వాత ఇప్పుడు పదో తరగతి పరీక్షలకు హాజరవుతుండడం గమనార్హం. వారి హాల్‌టికెట్లను, ముద్రించిన నామినల్ రోల్స్‌ను సంబంధిత పాఠశాలలకు పంపించారు. పదో తరగతి విద్యార్థుల హాల్‌టిక్కెట్లు షషష.bరవ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ నుంచి ఈనెల 12వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కోవిడ్-19 నేపథ్యంలో 70 శాతం సిలబస్‌తోనే ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే. జనరల్ సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రానికి సంబంధించి ప్రశ్నాపత్రాలు, జవాబుపత్రాలు విడిగా ఇవ్వబడతాయి. ప్రశ్నాపత్రంలో ఎక్కువ చాయిస్ ఇచ్చారు. విద్యార్థులు చదివిన పాఠశాలకు వీలైనంత దగ్గరలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
33 వేల మంది ఇన్విజిలేటర్ల నియామకం
2,861 పరీక్షా కేంద్రాల్లో 2,861 మంది చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), 2,861 మంది డిపార్ట్మెంటల్ అధికారులు (డీవో)తోపాటు 33 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నలుగురు ప్రత్యేక ఫ్లైయింగ్ స్క్వాడ్లు సహా రాష్ట్రవ్యాప్తంగా 144 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించామని పేర్కొన్నారు. మాల్‌ప్రాక్టీస్ జరగకుండా, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేందుకు డీఈవోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా సమయంలో కోతల్లేని విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్‌కో అధికారుల కోరామని వివరించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఇబ్బందుల్లేకుండా సకాలంలో చేరుకునేందుకు ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీని తగు చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఎండల తీవ్రత నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో ఏఎన్ఎం, ఆశా ఉద్యోగిని అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పరీక్షా కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా 144సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. చుట్టుపక్కల జిరాక్స్ కేంద్రాలు పరీక్షా సమయం పూర్తయ్యే వరకు మూసేయాలని కోరారు. పరీక్షల నిర్వహణ గురించి జిల్లాల వారీగా విద్యాశాఖ అధికారులను పరిశీలకులుగా నియమించామని పేర్కొన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీఎస్ గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది కోవిడ్-19 నిబంధనలు పాటించాలని కోరారు. పరీక్షలతో సంబంధం లేని వ్యక్తికి అనుమతించబో మని స్పష్టం చేశారు. విద్యార్థులు, సిబ్బంది సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావ్దొదని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద డీఈవో,ఎంఈవోల ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలని ఆదేశించారు.పరీక్షా సమయం పూర్తయ్యే వరకూ విద్యార్థులు, సిబ్బంది బయటికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌రూం 040-23230942 ఉందనీ, అన్ని డీఈవోల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు.
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి : మంత్రి సబిత
పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఒత్తిడి, భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. విద్యార్థులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. వారంతా పరీక్షల్లో విజయం సాధించి తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.