Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములై పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని తెలంగాణ ఎన్నారైలకు ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి అభివద్ధిని కొనసాగించాలని కోరారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్ ఆండ్ గ్రీట్‌లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తన పర్యటనలో పలువురు విదేశీ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో జరిపిన సమావేశాలు సంతప్తికరంగా ఉన్నాయన్నారు. త్వరలోనే వాటి ఫలితాలు రాష్ట్రంలో కనిపిస్తాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించి, తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చూడడమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పారు. స్వరాష్ట్రంలో కంపెనీలు స్థాపించి సంపద సష్టించాలనీ, హైదరాబాద్‌తో పాటు మిగతా పట్టణాలు, నగరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు.
కూర్మాచలం ఇంటికి మంత్రి కేటీఆర్
టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ లండన్ శాఖ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం ఇంటికి ఆపార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి తారక రామారావు వెళ్లారు. ప్రస్తుతం ఆయన యూకే పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కూర్మాచలం కుటుంబసభ్యులతో ముచ్చటించారు. ఉద్యమకాలంలోనూ, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కోసం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. తెలంగాణ బతుకమ్మ గురించి క్వీన్ ఎలిజబెత్‌కు వివరాలు అందిస్తూ అనిల్ కూర్మాచలం కుమార్తె నిత్య రాసిన లేఖకు, క్వీన్ నుంచి వచ్చిన ప్రశంసను తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆమెను అభినందించారు.