Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓడీ, ఓఎస్డీలు, డిప్యూటేషన్లను రద్దు చేయాలి
- మూల్యాంకనం కేంద్రాల్లో వసతులు కల్పించాలి : మంత్రి సబితకు టిప్స్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ బోర్డులో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరుగుతున్నాయని 'తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) విమర్శించింది. ఓడీలు, ఓఎస్డీలు, డిప్యూటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శనివారం హైదరాబాద్‌లో టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త మైలారం జంగయ్య నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు గ్విజయంగా పూర్తి కావడంతో మంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇంటర్ విద్యలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని సూచించారు. మూల్యాంకన కేంద్రాలలో పాల్గొంటున్న అధ్యాపకులందరికీ సరైన సదుపాయాలు కల్పించాలని వివరించారు. అధ్యాపకులు కోరుకున్న మూల్యాంకన కేంద్రాలలో అవకాశం కల్పించాలని సూచించారు. జీవోనెంబర్ 16 ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషనర్ వెంటనే ప్రభుత్వానికి పంపించేలా ఆదేశాలివ్వాలని తెలిపారు. అతిధి అధ్యాపకులకు 12 నెలల వేతనం (కన్సాలిడేటెడ్ పే) చెల్లించాలనీ, వారిని కళాశాలల ప్రారంభం నుంచే రెన్యూవల్ చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిప్స్ నాయకులు బండారి లక్ష్మయ్య, డాక్టర్ పరశురాములు, శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్, సంగీత, రాజేశ్వర్, దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, మహేష్, బాబు రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి : టిగ్లా
నూతనంగా నిర్మల్ జిల్లాలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని సస్పెండ్ అయిన జేఎల్ పి మధుసూదన్‌రెడ్డితో ప్రారంభోత్సవం చేయించిన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియెట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్‌ను శనివారం హైదరాబాద్‌లో టిగ్లా అధ్యక్షులు ఎం జంగయ్య, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్ కలిసి వినతిపత్రం సమర్పించారు.