Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి
- బంధువుల ఆందోళన
నవతెలంగాణ-నల్లగొండ
వైద్యుని నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన సంఘటన ఆదివారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కనగల్ మండలం తొరగల్లు గ్రామానికి చెందిన సింగం చంద్రశేఖర్ భార్య మహేశ్వరి రెండో కాన్పు కోసం ఈనెల 18న జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి మాతాశిశుకేంద్రంలో చేరింది. అప్పటినుంచి నార్మల్ డెలివరీ చేసేందుకు డాక్టర్లు వేచి చూశారు. కాగా ఆదివారం ఉదయం మహేశ్వరికి తీవ్రమైన పురిటినొప్పులు రావడంతో హుటాహుటిన డాక్టర్లు ఆపరేషన్ చేయగా శిశువు చనిపోయింది. దాంతో వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతో శిశువు తలకు గాయమై మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.