Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డికి వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అపరాల సాంకేతిక మిషన్ పథకం (1985-1989) తరహాలో ప్రస్తుతం అపరాలు, నూనె, పప్పుగింజల సాగును ప్రోత్సాహించాల్సిన అవసరముందని ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచించారు. పంటల వైవిధ్యీకరణ తప్పనిసరి అనీ, వరి సాగు నుంచి పప్పు, నూనె గింజల సాగు వైపు రైతులు మళ్లాలని కోరారు. ఆయిల్ పామ్ సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో శోభనాద్రీశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ విధానాలు భేష్‌గా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మద్దతుధరల విషయ ంలో అవలంభిస్తున్న లోపభూయిష్ట విధానాల మూలంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని కోరారు.