Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
నవతెలంగాణ-చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రైతులు జాతీయ రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న సీఐ బీమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నాయకులతో ఫోన్లో మాట్లాడారు. రైతుల సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పి రాస్తారోకో విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు నక్కల యాదవ రెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్‌ను 24 గంటల పాటు రైతులకు అందుబాటులో విద్యుత్ కోతలు లేకుండా చూడాలన్నారు. జల్లెడ పట్టే మిషన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. మార్కెట్లో తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో ధాన్యం కటింగ్ చేయొద్దని కోరారు. కాగా, రచ్చబండ కార్యక్రమాన్ని ముగించుకొని చేర్యాలకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రాస్తారోకో చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని మద్దతు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పొనుగోటి శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం, రాజయ్య, యెల్లమ్మ, రాజమణి, పోచవ్వ, నరహరి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.