Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు హరీశ్ రావు, తలసాని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి ఉద్దేశించిన పథకాలను వేగవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో వారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై గొర్రెల యూనిట్లు, పాడి పశువుల పంపిణీ తదితర పథకాల పై జరిగిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాలను మరింత వేగవంతంగా అమలు చేయడానికి తగిన సూచనలు చేశారు. పశు వైద్యశాలల ఆధునీకరణ, నూతన పశు వైద్యశాలల నిర్మాణం, రావిర్యాలలో నిర్మిస్తున్న మెగా డైరీ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో ఉన్న అన్ని నీటి వనరులలో చేప పిల్లలు, రొయ్య పిల్లల విడుదలపై కూడా సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తదితర అధికారులు పాల్గొన్నారు. కాగా ఉస్మానియాపై త్వరగా రిపోర్ట్ ఇవ్వాలి అని చీఫ్ ఇంజినీర్ల కమిటీకి మంత్రులు ఆదేశించారు. కొత్త మెడికల్ కాలేజీల పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అదేశించారు.