Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్త పర్యటన మొదలు పెట్టిన సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఈ నెల 20న మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన ఢిల్లీ, చండీఘర్ ప్రాంతాల్లో పలు సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 24, 25 తేదీల్లో ఆయన రాష్ట్రంలో ఉండనున్నారు. తిరిగి ఈ నెల 26న బెంగుళూరుకు వెళ్లి భారత మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు. అక్కడ్నుంచి రాలేగావ్ సిద్ధికి వెళ్లి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ అవుతారు. అక్కడ్నుంచి హైదరాబాద్ రానున్న ఆయన తిరిగి మే 29, 30 తేదీల్లో బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.