Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవాక్కైన పదో తరగతి విద్యార్థులు
నవతెలంగాణ-కోదాడరూరల్
పదో తరగతి పరీక్షలు మొదటి రోజునే విద్యార్థులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. తెలుగు పేపర్‌కు బదులు సంస్కృతం పేపర్ ఇవ్వడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడం పట్టణం లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థికి, శ్రీ చైతన్య పాఠశాలలో 26 మంది విద్యార్థులకు తెలుగు పేపర్‌కు బదులు సంస్కృతం పేపర్ ఇవ్వడంతో కంగారుపడ్డారు. దీనిపై ఎంఈఓ సలీమ్ షరీఫ్‌ను వివరణ కోరగా.. విద్యార్థుల తప్పిదం వల్లనే ఇలా జరిగిందన్నారు. అన్ని సెంటర్లలో నూ ఇలానే ఉందన్నారు. హాల్‌టికెట్‌లో ఏ లాంగ్వేజ్ ఉంటే అదే ఇస్తామన్నా రు.విద్యార్థులతో డిక్లరేషన్ తీసుకొని తెలుగు పేపర్ ఇచ్చామన్నారు.