Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు కూడా ఆరాష్ట్రాన్ని సందర్శించలేదు : ఇందిరాశోభన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గత ఇరవై ఐదేండ్లుగా గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొడుతున్న మోడీ... అది ఒక డొల్ల అని తేలిపోయిందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరాశోభన్ విమర్శించారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రాన్ని ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా సందర్శించలేదని గుర్తు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోడల్ అందరినీ ఆకర్షించడం వల్లే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అంతర్జాతీయ ప్రముఖులు ఢిల్లీని సందర్శిస్తున్నారని చెప్పారు. ఆప్ రాజకీయాలు చేయడానికి రాలేదనీ, రాజకీయాలను మార్చడానికి వచ్చిందని చెప్పిన మాటను కేజ్రీవాల్ నిలబెట్టుకున్నారని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇందిరా విలేకర్లతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఢిల్లీ మోడల్ బస్తీ దవాఖనాలు తెరిచారనీ, ఉచితంగా ప్రతి ఇంటికి నెలకు 20వేల లీటర్ల అందిస్తామని ప్రకటించారని అదంతా ఒట్టి బూటకమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన గుడ్ గవర్నెన్స్ వరకే పరిమితమనీ, అందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడి బస్తీ దవాఖానాలు పైన పటారం లోన లోటారమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విద్యా, వైద్య విధానంలో సీఎం కేసీఆర్ వైఫల్యం చెందానంటూ పరోక్షంగా ఒప్పుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ సర్కారుపై తమ పోరాటాన్ని తీవ్రం చేస్తామని చెప్పారు.