Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు టీఎస్టీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేసవి సెలవులు ముగిసేలోగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్న తులు, పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టేందుకు షెడ్యూల్ను విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ (టీఎస్టీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని సోమవారం హైదరా బాద్లో టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. పండితులు, పీఈటీలకు పదోన్నతులతోపాటు పీఎస్హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి నూతనంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా విద్యావాలంటీర్లను నియమించాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తున్నందున పుస్తకాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. యూనిఫారాలు సరఫరా చేయాలని తెలిపారు. జీవోనెంబర్ 317 అప్పీళ్లతో పాటు పరస్పర బదిలీల సమస్యను పరిష్కరిం చాలని పేర్కొన్నారు. 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీల నిషేధాన్ని ఎత్తేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.