Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బులు డిమాండ్ చేస్తున్న డాక్టర్‌పై వేటు
- ప్రజల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తే చర్యలు తప్పవు : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని వైద్యఆరోగ్య శాఖ మంత్రి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గైనకాలజీ వార్డు సందర్శించిన మంత్రి, ఆ వార్డులో నిత్యం స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఆసత్రికి వచ్చే గర్భిణులకు 60 శాతం పైగా సాధారణ కాన్పులు జరగడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులకు లేకుండా చూడాలని తెలిపారు.
డబ్బులు డిమాండ్ చేసిన డాక్టర్‌పై వేటు
డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వస్తే రూ. 2 వేలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఆకస్మిక తనిఖీకి వచ్చిన పలువురు మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి అక్కడే ఉన్న వాచ్మెన్, ఇతర సిబ్బందిని విచారణ జరిపి, డాక్టర్ మూర్తిని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంతో నమ్మకంతో ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు సంతృప్తి కలిగేలా సేవలందించాలని సూచించారు.