Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదిలాబాద్ ప్రజావాణిలో జాతీయ జెండాతో ఆర్మీ జవాన్ వినతి
నవతెలంగాణ-విద్యానగర్
ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేసిన తన ఇంటిని విడిపించాలని ఓ ఆర్మీ జవాన్ సోమవారం ప్రజావాణిలో ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇస్లాంపూర్ కాలనీకి చెందిన ఆర్మీ జవాన్ మహ్మద్ అక్రం తన ఇంటిని గ్రామ పంచాయతీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే అనుచరుడు యూకుబ్ ఖురైషీ కబ్జా చేశాడని తెలిపారు. అధికారుల చుట్టూ తిరిగినా స్పందించడం లేదని, ఎమ్మెల్యేను, ఎంపీను సైతం కలిసి విన్నవించినా న్యాయం జరగలేదన్నారు. దేశరక్షణలో విధులు నిర్వర్తిస్తున్న తన ఇంటికి రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. దీనిపై అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.