Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీరజ్ కుటుంబాన్ని విమర్శించిన ఐద్వా రాష్ట్ర నేతలు
నవతెలంగాణ-ధూల్‌పేట్
రాష్ట్రంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, నీరజ్ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అర్.అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో కులదురహంకారహత్యకు గురైన నీరజ్ కుటుంబాన్ని ఐద్వా రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులు కె. ఆశాలత, సహాయకార్యదర్శి పి.శశికళతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం పరామర్శించింది. అనంతరం ఆఫ్జల్‌గంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డిని కలిసి హత్య సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. నీరజ్ పవార్ కుటుంబం తీవ్ర భయాందోళనల్లో ఉన్నదని, వారికి కనీసం రెండేండ్లపాటు పోలీస్ రక్షణ కల్పించాలని కోరారు. ఇలాంటి హత్యలు మరోసారి జరగకుండా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.