Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏలేటి మహేశ్వర్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కులాలపై టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్టు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి చెప్పారు. ఆ వ్యాఖ్యలు రేవంత్ వ్యక్తిగతమేనన్నారు. రెడ్లు, వెలమలకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. చొక్కారావు లాంటి నేతలు కాంగ్రెస్ కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. అన్ని వర్గాలు, కులాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యమి స్తుందన్నారు. ఆపార్టీలో అన్ని కులాలకు చెందిన వారు అగ్రస్థానాలు అధిరోహించారనీ, సామాజిక న్యాయం తమ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. రేవంత్రెడ్డి మాట్లాడింది ఆయన వ్యక్తిగతమైనదిగా భావిస్తున్నామనీ, నిన్న మొన్న వచ్చిన వారికి కాంగ్రెస్ గురించి తెలియదని వ్యాఖ్యానించారు. జూన్ 1, 2 తేదీల్లో హైదరాబాద్లో టీపీసీసీ వర్క్షాపు ఏర్పాటు చేస్తామన్నారు. అందులో చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తామని తెలిపారు.