Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి మూడురోజులపాటు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ అకాడమి చైర్మెన్ పి కృష్ణప్రదీప్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కోర్సుల్లో యూపీఎస్సీ సిలబస్, ఎన్సీఈఆర్టీ, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఆప్షనల్ ఎంపిక తదితర అంశాలపై సీనియర్ బ్యూరోక్రాట్లు, ర్యాంకర్లతో సమగ్ర అవగాహన కల్పిస్తామని వివరించారు. ఈ బ్రిడ్జి కోర్సు ఈనెల 29 నుంచి 31 వరకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హైదరాబాద్‌లో ఉన్న అశోక్‌నగర్‌లోని 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి సెమినార్ హాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యవక్తలుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య, సివిల్స్ మూడో ర్యాంకర్ ఐఏఎస్ రోణంకి గోపాలకృష్ణ, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చింతా గణేష్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంపా నాగేశ్వరరావు, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ జి వివేకానంద తదితరులు హాజరవుతారని వివరించారు.