Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 4.72 లక్షల మంది రైతుల నుంచి రూ.5,888 కోట్ల విలువ కలిగిన 30 లక్షలకుపైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాలకు తడిసిన 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామనీ, 500 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ ముగిసిందని వెల్లడించారు. రవాణా, అన్లోడింగ్ సమస్యలు లేవని స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో మెజార్టీ జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. జూన్ 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా సేకరణ ముగుస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా, ప్రతిపక్షాలు కొనుగోళ్లను అడ్డుకోవాలని చూసినా, రాష్ట్ర ప్రభుత్వంపై రూ.మూడు వేల కోట్లకు పైగా భారం పడుతుందని తెలిసిన రైతులను ఆదుకునేందుకు కొనుగోళ్లను కొనసాగిస్తున్నామని వెల్లడించారు.