Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రొఫెసర్ పి నీరదారెడ్డి మరణం పట్ల విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సంతాపం ప్రకటించారు. 1999 నుంచి 2004 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్‌గా పనిచేసి సమర్థవంతమైన అకడమిక్ అడ్మినిస్ట్రేటర్‌గా గుర్తింపు పొందారని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె నిబద్ధత కలిగిన విద్యావేత్త, రాష్ట్రంపై లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఆమె ఏ పదవిని అలంకరించినా దాన్ని వన్నె తెచ్చే వారని గుర్తు చేశారు. ఆమె మరణంతో రాష్ట్రం సమర్థవంతమైన విద్యావేత్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ప్రముఖ విద్యావేత్తను కోల్పోయాం : లింబాద్రి
ప్రొఫెసర్ పి నీరదారెడ్డి మరణం పట్ల ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ సంతాపం ప్రకటించారు. రాష్ట్రం ప్రముఖ విద్యావేత్తను కోల్పోయిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మంచి పరిపాలనాధికారిగా మానవత్వపు విలువలతో పనిచేశారని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.