Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ నియామకాల కోసం ఉత్తర్వులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హెచ్ఎమ్డీఏ పరిధిలోని 12 పురపాలక సంఘాలకు మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ నియామకం కొరకు ఆసక్తి, అర్హత ఉన్న అడ్వకేట్లు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో (05), మేడ్చల్ మల్కాజ్గిరి (03), సంగారెడ్డి (01), యాదాద్రి భువనగిరి (01) మెదక్ (02) పురపాలక సంఘాల్లో ఈ నియామకాలు చేయాల్సి ఉందని తెలిపారు. సంబంధిత జిల్లా బార్ అసోసియేషన్‌లో పదేండ్లు, సీనియర్ సివిల్ కోర్టులో ఐదేండ్ల అనుభవం కలిగిన వారు అర్హులని వివరించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యుర్థులు తమ దరఖాస్తులను జూన్ 1తేదీ సాయంత్రం 5 గంటల లోపు మాసాబ్‌ట్యాంక్‌లోని కమీషనర్ అండ్ డైరెక్టర్ అఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇవ్వాలని తెలిపారు.