Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక కష్టాల పేరుతో ఇవ్వలేమంటే కుదరదు
- జీహెచ్ఎంసీకి హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈపీఎఫ్ చెల్లించాలని పీఎఫ్ సహాయ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈపీఎఫ్ మొత్తం రూ.3,97,990తోపాటు ఆలస్యం చేసినందుకు వడ్డీ కింద రూ.4,81,610ను జమ చేయాలనీ, పీఎఫ్ సంస్థ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ రిట్‌ను కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ జి.రాధారాణి తీర్పు చెప్పారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల (ఎస్‌హెచ్‌జీ) పేరుతో ఔట్సోర్సింగ్ వర్కర్లు జీహెచ్ఎంసీలో పని చేస్తున్నారు. వీరికి పీఎఫ్ చెల్లిస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగా ఈపీఎఫ్ చెల్లించడం లేదు. ఈపీఎఫ్ చెల్లింపు జాప్యం చేసినందుకు అసలు, వడ్డీలను చెల్లించాలన్న పీఎఫ్ ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. కార్మికుల సంక్షేమం కోసం చెల్లింపులు జరపాలనీ, సంస్థకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రిటైర్ అయ్యాక కార్మికులు ఇబ్బందులు పడేలా చేయరాదని స్పష్టం చేసింది. రిట్ పిటిషన్‌కు కొట్టివేసింది.